మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే సతీష్ కుమార్

ఆలయ వేదపండితులు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.

Update: 2020-02-12 09:32 GMT

మురమళ్ళ: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ వీరేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 21 నుండి 25వ వరకు నిర్వహించబోయే మహాశివరాత్రి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన స్వగృహంలో ఆలయ చైర్మన్ కామరాజు (వాసు రాజు) కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణతో కలసి శివరాత్రి బుక్లెట్,,వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ.. కోనసీమలోని అతి పెద్ద శైవ క్షేత్రమైన శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకొనేందుకు శివరాత్రి సందర్భంగా విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా గా ఆలయ వేదపండితులు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.


Tags:    

Similar News