ఏపీలో రేపటినుంచే రూ.1000 పంపిణీ : ఏపీ మంత్రి పుష్పా శ్రీవాణి

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Update: 2020-04-03 14:57 GMT
CM Pushpa Srivani

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. అయితే లాక్ డౌన్ వలన పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉచిత రేషన్ బియ్యంతో పాటు రూ.వేయి పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది.

ఇప్పటికే రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా, ఇక రేపటి నుంచి(ఏప్రిల్ 04) నుంచి పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి నేరుగా రూ. వేయి అందజేస్తారని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా ఇదే విషయంపై ముఖ్యమంత్రి జగన్ కూడా అధికారులకు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో కోవిడ్‌ –19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్షించారు. 

Tags:    

Similar News