తెగుళ్లు సోకి దెబ్బతిన్న వేరుశనగ పంటలను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్: శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి నియోజక వర్గంలోని అన్ని మండలాలలో రైతులు సాగుచేసిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించి రైతన్నలకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Update: 2020-01-17 10:18 GMT
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

గాలివీడు: రాయచోటి నియోజక వర్గంలోని అన్ని మండలాలలో రైతులు సాగుచేసిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించి రైతన్నలకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాలివీడు మండలం పందికుంట గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులుతో కలసి చిక్కాకు మచ్చ రోగానికి గురైన వేరుశనగ, వరి పంటలను పరిశీలించారు.

పంటలుకు రోగాలు సోకినా వ్యవసాయ శాఖ పరిశీలించక పోవడంతోనే పంటలు దెబ్బతిన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టం పై తనకు పూర్తి నివేదికలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతన్నలు కూడా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది సూచనలు పాటించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రైతన్నలు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తోందన్నారు. రైతులుకు సేవలు అందించేందుకు గాను వ్యవసాయ శాఖలో వివిధ రకాల పోస్టులును దేశంలో ఎక్కడా లేనివిధంగా సిఎం జగన్ భర్తీ చేశారన్నారు. ఫిబ్రవరి మాసం నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News