Srisailam: శ్రీశైల క్షేత్రంలో శాస్త్రోక్తంగా గిరి ప్రదక్షిణ

Srisailam: ఆది దంపతులకు ప్రత్యేక పూజలతో నివేదన

Update: 2023-08-02 03:44 GMT

Srisailam: శ్రీశైల క్షేత్రంలో శాస్త్రోక్తంగా గిరి ప్రదక్షిణ

Srisailam: శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆషాడ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆది దంపతులైన మల్లికార్జున స్వామి, శ్రీ బ్రమరాంభిక అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవర్లను లోకసంచారసంకేతంగా పల్లికీలో విహరింపచేశారు. ప్రత్యేక పూజలు నివేదించిన తర్వాత శ్రీ స్వామి అమ్మవార్లను ధర్మ ప్రచారరధంలో శ్రీశైల గిరి ప్రదక్షిణ చేశారు.

గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధరమండపము, ఆంకాళమ్మఆలయం, నందిమండపము,గంగాసదనము ,బయలు వీరభద్రస్వామి ఆలయం పంచమఠాలు, మల్లమ్మ కన్నీరు పుష్కరిణివద్దకు చేరుకొని తిరిగి నందిమండపము మీదుగా ఆలయమ హద్వారము చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది. క్షేత్రాన్నిఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు.

Tags:    

Similar News