Vijayawada: రాహుల్‌ హత్య కేసులో మరొకరు అరెస్ట్‌

* పోలీసుల అదుపులో గాయత్రి * విజయవాడ కోర్టులో గాయత్రిని హాజరుపర్చే ఛాన్స్‌ * రాహుల్‌ హత్యలో గాయత్రి పాత్రే కీలకం..?

Update: 2021-09-03 07:34 GMT

రాహుల్‌ హత్య కేసులో మరొకరు అరెస్ట్‌ (ఫైల్ ఫోటో)

Vijayawada: రాహుల్‌ హత్య కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ కోర్టులో గాయత్రిని హాజరుపరిచే అవకాశం ఉంది. రాహుల్‌ హత్యలో గాయత్రి పాత్రే కీలకమని అనుమానిస్తున్నారు. తన కూతురికి మెడికల్‌ సీట్‌ ఇప్పించాలని రాహుల్‌కి గాయత్రి 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మెడికల్‌ సీట్‌ రాకపోవడంతో గాయత్రి రాహుల్‌పై కోపం పెంచుకుంది. కోరాడ విజయ్‌కుమార్‌, కోగంటి సత్యంలతో కలిసి రాహుల్‌ హత్యకి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News