గరుడ వారధి ఫ్లై ఓవర్ నిర్మాణానికి బ్రేక్

పెద్దల, ఆగమ సలహాదారుల ఆభిప్రాయం తీసుకుంటాం గరుడ వారధి భక్తుల సెంటిమెంట్ తో కూడుకున్నది-టీటీడీ చైర్మన్

Update: 2020-02-14 02:33 GMT
yv subba reddy File Photo

తిరుపతిలో గరుడ వారధి ఫ్లై ఓవర్ డిజైన్ ఫైనల్ కాలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వారధిపై నామాల విషయంలో పెద్దలు, ఆగమ సలహా దారుల అభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామని చెప్పారు. పద్మావతి అతిథిగృహంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో గరుడవారధిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గరుడ వారధిలో మార్పులు, చేర్పులు ఏవైనా చేయాల్సి ఉంటే భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా చేస్తామన్నారు. టీడీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్న తర్వాతే నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. త్వరలో జరుగబోయే ధర్మ కర్తల మండలి సమావేశంలో గరుడ వారధిపై చర్చిస్తామన్నారు.

శ్రీవారిని ద‌ర్శించ‌డానికి ప్రపంచం నలుమూల‌ల నుంచి భక్తులు అధికంగా వస్తుంటారు. ఇందుకోసం భారీ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు తిరుపతి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ అధికారులు. గత ప్రభుత్వం గరుడ వారధి ప్రాజెక్టుపై సరిగా వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. అందుకే నామాల విషయంలో గందరగోళం నెలకొందని అన్నారు. గరుడ వారధి ఫ్లై ఓవర్‌లో మార్పులు చేసి టీటీడీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. గరుడ వారధిపై వాహనాలు వెళతాయని.. ఇది భక్తుల సెంటిమెంట్‌తో కూడుకున్న విషయమని తెలిపారు.

Tags:    

Similar News