Ganta srinivasa rao ysrcp august 9th : వైసీపీలో గంటా చేరికకు లైన్ క్లియర్ అయిందా?

Update: 2020-07-31 08:08 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారంటూ గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఇటు వైసీపీ కానీ అటు గంటా కానీ ఖండించలేదు. ఇక గంటాను వైసీపీలో చేర్చుకోవడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ బలంగా ఉంది. అన్నీ కుదిరితే ఆగస్టు 15న అధికార పార్టీలో చేరతారని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు ఆగస్టు 15 కాదు.. 9న ఆయన వైకాపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో గంటా శ్రీనివాసరావు ఆగస్టు 9న వైకాపా కండువా కప్పుకుంటారని ఆ వార్తల సారాంశం.

ఇదిలావుంటే గంటా శ్రీనివాసరావు పార్టీలు మారడం కొత్తేమి కాదు. మొదట టీడీపీ నుంచి తన రాజకీయ భవిశ్యత్ ను ప్రారంభించిన గంటా.. ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరారు. అప్పటికే ఆ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గంటా కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనంతో ఆ పార్టీ సభ్యుడయ్యారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ కు నామరూపాలు లేకుండా పోవడంతో తిరిగి టీడీపీలో చేరారు. మంత్రిగా పనిచేశారు. 2019 లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యే అయినా టీడీపీ అధియక్రంలోకి రాలేదు. దాంతో అప్పటినుంచి టీడీపీలో గంటా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.  

Tags:    

Similar News