Ganta Srinivasa Rao: నా రాజీనామాలో రాజకీయ కుట్ర దాగి ఉంది
Ganta Srinivasa Rao: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సీఎం ఎలాంటి సహకారం అందించలేదు
Ganta Srinivasa Rao: నా రాజీనామాలో రాజకీయ కుట్ర దాగి ఉంది
Ganta Srinivasa Rao: విశాఖకు తలమానికమైన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడమే తన లక్ష్యమని, విశాఖ ఉద్యమానికి ఒక ట్రిగ్గర్ కావాలని ఎమ్మెల్యే పదవికి ఆనాడు రాజీనామా చేశానని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సీఎం ఎలాంటి సహకారం అందించడం లేదని, సీరియస్‌గా దృష్టి పెట్టలేదని విమర్శించారు. వైసీపీకి అత్యధికంగా ఎంపీల బలం ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ విషయంలో చేతకాకుండా పోయారని ఎద్దేవా చేశారు.
రాజీనామాలతో ప్రైవేటీకరణ ప్రక్రియ నెమ్మదిస్తుందని భావించానని తెలిపారు. 2021 ఫిబ్రవరి 12 న రాజీనామా చేశానని, కానీ ఉప ఎన్నికలు రానుండడంతో ఇప్పుడు ఆమోదించారని అన్నారు. తన రాజీనామాలో రాజకీయ కుట్ర దాగి ఉందని, మరికొన్ని రోజుల్లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందని, టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఓటు తగ్గించాలనే దురుద్దేశంతో తన రాజీనామా ఆమోదించారని అన్నారు.