అంతర్జాతీయ టూరిజం మ్యాప్ లో గండికోట: మంత్రి అవంతి శ్రీనివాస్

అంతర్జాతీయ టూరిజం మ్యాప్ లో కడప జిల్లా గండికోట ఉండే విధంగా గండికోటను అభివృద్ధి చేయడం జరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Update: 2020-01-12 07:27 GMT

జమ్మలమడుగు: అంతర్జాతీయ టూరిజం మ్యాప్ లో కడప జిల్లా గండికోట ఉండే విధంగా గండికోటను అభివృద్ధి చేయడం జరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గండికోట ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, మైనార్టీ శాఖ మంత్రి ఎస్ బి అంజాద్బాష, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి కిరణ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి, లు గండికోట ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసులు మాట్లాడుతూ గండికోటకు ఒక చరిత్ర ఉందని ఈ ప్రాంతాన్ని రాష్ట్ర లోనే కాదు దేశంలో ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా గుర్తుండిపోయే టట్లు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గండికోట లో 5 స్టార్ రిసార్ట్ కట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఉన్నారన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రోప్ వే కి సంబంధించి కూడా ప్రణాళికలు చేస్తున్నామని రాబోయే రోజులలో గండికోటను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు.


Tags:    

Similar News