Gade Venkateswararao: పవన్ కళ్యాణ్ కోరుకుంటున్న మార్పు జనంలో వస్తోంది

Gade Venkateswararao: పవన్ కళ్యాణ్ ఆశించిన మార్పు గ్రామస్థాయిలో కనిపిస్తుంది

Update: 2023-04-17 07:18 GMT

Gade Venkateswararao: పవన్ కళ్యాణ్ కోరుకుంటున్న మార్పు జనంలో వస్తోంది

Gade Venkateswararao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకుంటున్న మార్పు జనంలో వస్తోందని .. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన జనసేన కమిటీ నియామకాలు సందర్భంగా.. ఏర్పాటైన సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు పాల్గొని నూతన కమిటీ ప్రతినిధులకు నియామక పత్రాలు అందజేశారు. గ్రామ కమిటీ నియామకం సమయంలోనే.. ఎన్నికల ప్రచారం తరహాలో జనం తరలివచ్చి జనసేనకు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆశించిన మార్పు గ్రామస్థాయిలో కూడా కనిపిస్తోంది ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Tags:    

Similar News