నిండు కుండలా శ్రీశైలం డ్యామ్..

Update: 2019-08-08 05:15 GMT

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని నదులకు భారీగా పెరిగిన వరద ప్రవాహంతో దిగువకు నీటి విడుదల ఎక్కవైంది. దీంతో ఆల్మట్టి జలాశాయానికి ప్రవాహం పెరుగుతుండటంతో.. నారాయణ్‌పూర్‌ నుంచి నీటి విడుదల పెరిగింది. ఫలితంగా శ్రీశైలం నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైల డ్యామ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 3 లక్షల 51 వేల 425 క్యూసెక్కుల వరదనీరు విడుదల కాగా, శ్రీశైలం డ్యామ్ కు 3 లక్షల 33 వేల 077 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది.శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 885 అడుగులు వుండగా, ప్రస్తుతం 874.70 అడుగులు వుంది. టోటల్ అవుట్ ఫ్లో 83, 339 వుంది. శ్రీశైలం కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం 64,989 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. 

Tags:    

Similar News