Guntur: గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నాపైన బాలుడు ఆచూకీ లభ్యం

*కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు *కిడ్నాపర్ల నుంచి బాబును రక్షించిన పోలీసులు

Update: 2021-10-16 08:03 GMT

గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నాపైన బాలుడు ఆచూకీ లభ్యం(ఫైల్ ఫోటో)

Guntur: గుంటూరులోని జీజీహెచ్‌లో కిడ్నాపైన నాలుగు రోజుల పసికందు ఆచూకీ లభ్యం అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు రోజుల బాబును రక్షించారు. తెల్లవారుజామున ఒంటి గంటన్నుర సమయంలో.. 4 రోజుల వయసున్న శిశువు కిడ్నాప్‌న‌కు గురియ్యాడు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ప్రియాంక ఈ నెల 13వ తేదీన బాబుకు జన్మనిచ్చింది. బాలింతను, శిశును చూసుకోవడం కోసం అమ్మమ్మ, నానమ్మ ఇద్దరూ హాస్పిటల్‌లోనే ఉన్నారు. శుక్రవారం రాత్రి సమయంలో పసికందు ఏడుస్తుండటంతో నాన్నమ్మ, అమ్మమ్మ బాబును బయటకు తీసుకొచ్చారు. తర్వాత పాలు తీసుకొస్తానని చెప్పి అమ్మమ్మ పక్కన ఉంచి వెళ్లింది.

నానమ్మ తిరిగొచ్చే సరికి పసికందును అపహరించారు. దీంతో ఆందోళన చెందిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హాస్పిటల్ గేటు ముందున్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా ఓ వ్యక్తి చిన్నారిని సంచిలో వేసుకొని తీసుకెళ్లడం కనిపించింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు బాలుడు ఆచూకీని కనుగొన్నారు. 

Tags:    

Similar News