East Godavari: గోదావరిలో నలుగురు టెన్త్ విద్యార్ధులు గల్లంతు
East Godavari: తూ.గో.జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో ప్రమాదం * గోదావరి తీరంలో ఆడుకునేందుకు వెళ్లి గల్లంతు
Representational Image
East Godavari: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరం దగ్గర గోదావరి నదిలో నలుగురు బాలురు గల్లంతయ్యారు. గోదావరి తీరంలో ఆడుకునేందుకు వెళ్లిన ఖండవిల్లి వినయ్, సంతాల పవన్, యర్రంశెట్టి రత్నసాగర్, బంగారు నవీన్ కుమార్.... రాత్రయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఊరంతా వెదికారు. అయితే, గోదావరి ఒడ్డున పిల్లలు బట్టలు, చెప్పులు మాత్రమే కనిపించడంతో గ్రామస్తుల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పడవల సాయంతో గోదావరిలో వెతుకుతున్నారు.