నాపై భారీ కుట్రకు ప్లాన్ చేశారు: పృథ్వీరాజ్

మద్యం సేవించినట్టు, ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్య సంభాషణ చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు.

Update: 2020-01-12 14:31 GMT
Prudhvi

ఆడిమో టేపుల వ్యవహారంపై ఆరోపణల నేపథ్యంలో SVBC చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. తాను మద్యం సేవించినట్టు, ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్య సంభాషణ చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు బాధపడుతున్నానని అన్నారు. తనకు మద్యం తాగే అలవాటు లేదని, తన బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షంచుకోవాలని తనపై ఆరోపణలు చేసిన వారికి సవాల్ విసిరారు.

తనపై వచ్చిన ఆరోపణలై ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మరోసారి స్పందించారు. లేనిపోనివి తనపై ప్రచారం చేస్తున్నారని.. తనకు పదవి వచ్చిందని కొందరు చూడలేకపోతున్నారని అన్నారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా అంకిత భావంతో పనిచేస్తునన్నారు. తన మాటలకు బాధపడ్డ రైతులు క్షమించాలని కోరారు. ఆడియోలో ఉంది తన వాయిస్ కాదని.. దీనిపై విచారణ చేపట్టాలని అన్నారు పృథ్వీరాజ్.

రైతులపై తాను చేసిన ఇంత రాద్దాంతం అవుతాయని ఏనాడూ అనుకోలేదని పృథ్వీ చెప్పుకొచ్చారు. కార్పొరేట్‌ రైతులనే తాను పెయిడ్ ఆర్టిస్టులని అన్నట్లు తెలిపారు. అమరావతిలో ఉన్న బినామీ రైతుల గురించే తాను మాట్లాడినట్లు గుర్తు చేశారు.

మరోవైపు తాను పద్మావతి గెస్ట్‌ హౌజ్‌లో మద్యం సేవించినట్లు వచ్చిన వార్తలను పృథ్వీ ఖండించారు. అవకాశం ఉంటే తన బ్లడ్ శాంపిల్స్‌ కూడా తీసుకొని పరీక్షించుకోవచ్చని.. తేల్చిచెప్పారు. ఒకానొక దశలో తీవ్రంగా స్పందించిన పృథ్వీ.. తాను మద్యం సేవించి ఉంటే చెప్పుతో కొట్టాలని స్పష్టం చేశారు.

ఇటీవల శబరిమల పర్యటనలో ఉన్నప్పుడే తనపై భారీ కుట్ర జరుగుతుందన్న విషయం తెలిసిందని.. పార్టీలో తన వాయిస్ లేకుండా చేసేందుకు కుట్ర పన్నారని.. పృథ్వీరాజ్‌ చెప్పారు. ఇంతవరకు ఎస్వీబీసీ ఉద్యోగుల్లో ఏ ఒక్కరు కూడా తనను ఒక్క మాట కూడా అనలేదని వివరించారు.

మరోవైపు పోసానిపై స్పందించిన పృథ్వీ.. ఆయన అలా ఎందుకు స్పందించారో తెలియదని చెప్పారు. సీఎం జగన్‌కు, టీటీడీ ఛైర్మెన్‌ వైవీ సుబ్బారెడ్డికి తాను దగ్గర అవుతున్నాననే.. కొందరు టార్గెట్ చేశారని ఆరోపించారు. పోసాని, తాను మంచి మిత్రులమని చెప్పుకొచ్చారు.


Full View

Tags:    

Similar News