వైసీపీకి మాజీ ఎమ్మెల్యే మక్కెన రాజీనామా
Makkena Mallikarjuna Rao: మక్కెన నివాసానికి చేరుకున్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు
వైసీపీకి మాజీ ఎమ్మెల్యే మక్కెన రాజీనామా
Makkena Mallikarjuna Rao: పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మక్కెన నివాసానికి పల్నాడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు చేరుకున్నారు. ఈ సందర్భంగా మక్కెనను టీడీపీలోకి ఆహ్వానించారు జీవీ ఆంజనేయులు. ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలతో చర్చించి.. నిర్ణయం చెబుతానని మక్కెన మల్లికార్జునరావు ప్రకటించారు. టీడీపీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు.