గురుపూజల్లో ప్రసంగించిన విదేశీ సాధకులు

Update: 2020-01-13 14:29 GMT

అడివివరం: పరమ గురువుల ప్రణాళికలో భాగంగా జగద్గురు పీఠం 1971 నుంచి నిర్వహిస్తోన్న ఆధ్యాత్మిక సమన్వయ కార్యక్రమం పవిత్ర యజ్ఞమని పలువురు విదేశీ సాధకులు కొనియాడారు. గురుపూజోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రాక్పశ్చిమ సమన్వయ సమావేశం జరిగింది.

సంస్థ అంతర్జాతీయ కోఆర్డినేటర్‌ లుడ్జర్‌ ఫిలిప్స్‌ మాట్లాడుతూ...పైథాగరస్‌, రష్యా దేశీయురాలు మేడం బ్లావెట్స్కీ, మాస్టర్‌ ఇ.కె. రచనలు ప్రస్తుతం భౌగోళికంగా అనుష్ఠించబడుతున్నాయన్నారు. గ్రీక్‌ దేశీయుడు హర్మెన్‌ మాట్లాడుతూ... మాస్టర్‌ ఇ.కె., మాస్టర్‌ పార్వతీకుమార్‌లు రాసిన పలు గ్రంథాలను జర్మన్‌, స్పానిష్‌ భాషల్లో అనువదించామన్నారు. మాస్టర్‌ పార్వతీకుమార్‌ మాట్లాడుతూ... స్వామీ వివేకానంద, అరవింద మహర్షి, స్వామి శివానంద, యోగానంద, అనిబిసెంట్‌ వంటి వారు ప్రాక్పశ్చిమ సమన్వయానికి కృషి చేశారన్నారు.  

Tags:    

Similar News