శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో మంటలు 25 లక్షల నష్టం !

-ఒకటో నెంబర్ యూనిట్‌‌లో చెలరేగిన మంటలు -సాంకేతిక లోపంతో సమస్య వచ్చిందన్న అధికారులు -ప్రమాద సమయంలో దట్టంగా వ్యాపించిన పొగలు -ఒకటో నెంబర్ యూనిట్‌‌లో నిలిచిన 110 మెగావాట్ల విద్యుత్ -జెన్‌‌కోకు రోజుకు రూ. 20 నుంచి 25 లక్షల మేర నష్టం -మరమ్మతులు చేసేందుకు నెల పడుతుందన్న అధికారులు

Update: 2019-09-19 06:07 GMT

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఒకటో నెంబర్ యూనిట్‌‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జనరేటర్ కూలర్ బేరింగ్ పాడవడంతో ఆయిల్ పూర్తిగా సరఫరా కాక ప్యాడ్స్ మధ్య వేడి చెలరేగి మంటలు వచ్చినట్లు సమాచారం. ఈ మంటలతో దట్టంగా పొగ కమ్మడంతో అప్రమత్తమైన సిబ్బంది COటూ గ్యాస్ ద్వారా మంటలను అదుపుచేశారు.

శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం లో ఏడు యూనిట్‌లు ఉండగా 110 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గత నెల రోజులుగా విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగుతూ ఉండటం వల్ల సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిని మరమ్మతులు చేసేందుకు బి హెచ్ ఈ ఎల్ నిపుణులు రానున్నారు. మరమ్మతులకు నెల వరకు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఆరు జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి జనరేటర్ నిలిచిపోవడంతో రోజుకు 25 లక్షల వరకు రోజు నష్టం వాటిల్లనుందని సమాచారం 

Tags:    

Similar News