Fire Accident in Vizag Quarantine Center: విశాఖ క్వారంటైన్ సెంటర్ లో అగ్నిప్రమాదం
Fire Accident in Vizag Quarantine Center: విజయవాడ స్వర్ణా ప్యాలెస్(రమేశ్ ఆసుపత్రి) ఘటన ఇంకా మరువక ముందే.. ఏపీలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
vizag fire accident
Fire Accident in Vizag Quarantine Center: విజయవాడ స్వర్ణా ప్యాలెస్(రమేశ్ ఆసుపత్రి) ఘటన ఇంకా మరువక ముందే.. ఏపీలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని ఓ క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది. మదురవాడ సమీపంలోని కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి కేంద్రంలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్దం అయ్యాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండొచ్చని యాజమాన్యం భావిస్తోంది. తాజా ప్రమాదంతో కరోనా బాధితులను మరో బ్లాక్‌కు తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశామని నిముషాల వ్యవధిలోనే సిబ్బంది వచ్చి.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఊపిరి పీల్చుకున్నారు.