Andhra Pradesh: అమరరాజా ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్నఅగ్నికీలలు
*విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండొచ్చని సమాచారం
అమరరాజా ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్నఅగ్నికీలలు
Andhra Pradesh: చిత్తూరుజిల్లా యాదమరి మండలం మోర్థానపల్లెలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమరరాజా ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో భారీగా నష్టం వాటిల్లిందని సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండొచ్చని అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అమరరాజా ఫ్యాక్టరీకి చేరుకున్నారు. ఎగసిపడుతున్న మంటలను అదుపుచేయడానికి ఉద్యోగులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.