వడ్డీ వ్యాపారి దారుణ హత్య

పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. వడ్డీ వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీలే కారణంగా తోటి భాగస్వామి హత్య చేశాడు.

S. Srikanth
Published on: 27 Nov 2019 10:35 AM IST
వడ్డీ వ్యాపారి దారుణ హత్య
X
Representational Image

తుని: పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. వడ్డీ వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీలే కారణంగా తోటి భాగస్వామి హత్య చేశాడు. అనపర్తి నియోజకవర్గంలో రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక సీతారాంపురంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో వ్యాపార భాగస్వాముల మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో ముగ్గురి మద్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ తరుణంలో కర్రి మారెడ్డి సహచరుడు నల్లమిల్లి రాజారెడ్డిని కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరో సహచరుడు నల్లమిల్లి హారనాధ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేసాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే రాజారెడ్డి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ బాబు చెప్పారు.

S. Srikanth

S. Srikanth

Next Story