Representational Image
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరు ఉధృతం అవుతోంది. ఉక్కునగరంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతికేకిస్తూ ఉద్యోగులు, కార్మికులతో పాటు బీజేపీయేతర పార్టీలు నిరసనలతో కదంతొక్కుతున్నాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పక్షాలు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఇక గంటా శ్రీనివాస్ నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు వ్యూహం రచిస్తున్నారు.