33వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన

రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన ఆదివారం నాటికి 33వ రోజుకు చేరింది.

Update: 2020-01-19 11:19 GMT

అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన ఆదివారం నాటికి 33వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరులో రైతుల మహాధర్నాలు చేస్తున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతులు రిలేదీక్షలు చేపట్టారు. ఉద్దండరాయునిపాలెంలో మహిళా రైతులు అమరావతి కోసం పూజలు చేస్తున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంలో రైతుల నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఆదివారం దుర్గగుడి వరకు పొంగళ్లు పట్టుకుని రైతులు పాదయాత్ర చేయనున్నారు. మందడం, వెలగపూడి రైతులు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. అటు తుళ్లూరులోనూ మహాధర్నా, వంటావార్పు నిర్వహించనున్నారు. నెల రోజులకుపైగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రైతులు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు.

Tags:    

Similar News