నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించాలంటే దళితులకు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని రైతులు రెండు వర్గాలు విడిపోయారు. రాజధాని ఇక్కడే ఉం చాలని ఓ వర్గం రైతులు అంటుంటే, తమకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ మరో వర్గం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలెవరూ భూములు ఇవ్వలేదన్నారు. తమకు ఇచ్చిన ప్లాట్ల మధ్యలో 25 లక్షల గజాలు ఎందుకు హోల్డ్‌లో పెట్టారో చంద్రబాబు చెప్పాలన్నారు.