Elephant Attack: ఏనుగు బీభత్సం.. దాడిలో రైతు మృతి
Elephant Attack: పెంచికల్‌పేట(మ) కొండపల్లి గ్రామంలో.. పోచయ్య అనే వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగు
Elephant Attack: ఏనుగు బీభత్సం.. దాడిలో రైతు మృతి
Elephant Attack: కొమురంభీం జిల్లాలో ఏనుగుల సంచారం హడలెత్తిస్తోంది. పంట పొలానికి వెళ్లిన పోచయ్య అనే రైతును తొక్కిచంపింది గజరాజు. పెంచికల్‌పేట మండలం కొండపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామంలో శంకర్ అనే వ్యక్తిని కూడా తొక్కి చంపేసింది ఏనుగు. గజరాజుల వరుస దాడులతో హడలెత్తిపోతున్నారు గ్రామస్తులు.
ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి అటాక్ చేస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నారు రైతులు. ఇక ఏనుగులను మహారాష్ట్ర వైపునకు మళ్లించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేశారు. ఏనుగులు సంచరిస్తోన్న గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగుల సంచారం దృష్ట్యా గ్రామస్తులెవరూ బయటకు రావొద్దని సూచించారు.