జనసేనాని పవన్‌కు బాసటగా కుటుంబ సభ్యులు
Janasena: కౌలు రైతుల భరోసా నిధికి కుటుంబ సభ్యులు రూ.35 లక్షలు విరాళం
జనసేనాని పవన్‌కు బాసటగా కుటుంబ సభ్యులు
Janasena: జనసేనాని పవన్ కల్యాణ్‌కు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోడానికి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు 35 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఎన్నడూ ఇంట్లో రాజకీయాల గురించి మాట్లాడుకోని సభ్యులు కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోడానికి ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకోవడం అభినందనీయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యాలయం వచ్చిన పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు నగదు చెక్కులను అందించి, కౌలు రైతు కుటుంబాలను ఆదుకోమని సూచించారు.