నకిలీ ఐ.ఆర్.ఎస్ అధికారి పేరిట శ్రీవారి వీఐపి బ్రేక్ దర్శన టికెట్లు

నకిలీ ఐ.ఆర్.ఎస్ అధికారి పేరిట శ్రీవారి వీఐపి బ్రేక్ దర్శన టికెట్లు పొందిన వ్యక్తిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2019-12-13 14:30 GMT
Thirumala

నకిలీ ఐ.ఆర్.ఎస్ అధికారి పేరిట శ్రీవారి వీఐపి బ్రేక్ దర్శన టికెట్లు పొందిన వ్యక్తిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన చీరల డిజైనింగ్ వ్యాపారి కె.వి. రత్నారెడ్డి... డైరెక్టర్ జనరల్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మహారాష్ట్ర పేరుతో డూప్లికేట్ ఐడీ కార్డును సృష్టించుకుని గురువారం విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల కోసం టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో లేఖ సమర్పించారు. సిబ్బంది వెంటనే టికెట్లు మంజూరు చేశారు. రత్నారెడ్డి ఐడెంటీటీపై అనుమానం కలగడంతో మహారాష్ట్ర అధికారులతో క్రాస్ చేశారు. ఆ పేరుతో ఎవరూ లేరని తెలిసింది. దీంతో విజిలెన్స్ వారిని అప్రమత్తం చేశారు. ఉదయం దర్శనానికి వెళుతున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News