జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను సస్పెండ్ చేసినట్టు నోట్..

Update: 2019-12-19 06:06 GMT

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను టార్గెట్ చేశారు నెటిజన్లు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఫేక్ నోట్ సృష్టించి దాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. దీనిపై జనసేన అధిష్టానం సీరియస్ అయింది. తమ పార్టీపై దుష్ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామని జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ దుష్ప్రచారం వెనుక కొందరు రాజకీయ నేతల హస్తం ఉన్నట్టు వారు అనుమానిస్తున్నారు. అయితే రాపాక వరప్రసాద్ మాత్రం దీనిపై స్పందించలేదు. గతంలో ఒకసారి తాను జనసేనలోనే ఉంటానని స్పష్టం చేశారు.

గతకొంతకాలంగా ఎమ్మెల్యే రాపాక జనసేన అధిష్టానం వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిలో మార్పు రావాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎమ్మెల్యే రాపాక సమర్ధిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది జనసేన. తాజాగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రత్యర్ధులు ఫేక్ నోట్ సృష్టించినట్టు జనసేన ఆరోపిస్తోంది. 

Tags:    

Similar News