Anantapuram: అనంతపురంలో దొంగ స్వామి బాగోతం

*ముఖ్యమంత్రి కుటుంబీకుల పేరును వాడిన వైనం *పని జరగక ముందే రూ.45 లక్షలు నగదు, కారు వసూలు

Update: 2021-10-25 06:29 GMT

అనంతపురంలో దొంగ స్వామి బాగోతం

Anantapuram: అమాయక ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్పి డబ్బులు గుంజుతూ అక్రమాలకు పాల్పడుతున్న దొంగ స్వామీజీ బండారం బయటపడింది. తాజాగా అనంతపురంలోని ఓ దొంగ స్వామిజీ మోసాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన తులసమ్మ మూడేళ్ల క్రితం బెంగళూరు ఎయిర్‌ పోర్టులో 4కిలోల బంగారంతో కస్టమ్స్ అధికారులకు పట్టబడింది. దీంతో తులసమ్మను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తోంది. ఇటీవల యూట్యూబ్‌లో అనంతపురంలోని సిండికేట్ నగర్‌లో ఉన్న ఆలయం పీఠాధిపతి బాలకృష్ణ స్వామిజీ మహిమలు తెలుసుకుంది తులసమ్మ. దీంతో స్వామిజీని సంప్రదించింది.

ఇదే అదునుగా తులసమ్మ నుంచి డబ్బులు గుంజాలని బాలకృష్ణ స్వామిజీ స్కేచ్ వేశాడు. తాడిపత్రి మండలంలోని బోడయిపల్లెకు చెందిన మోహన్ రెడ్డిని పరిచయం చేశాడు. కోర్టు నుంచి బంగారం విడిపిస్తాడని నమ్మబలికాడు. అతన్ని కలుసుకున్న తులసమ్మకు నీ పనిని నేను చేస్తాను నాకు సీఎం జగన్ బాగా తెలుసు, అధికారులతో మాట్లాడి నీ పని చేస్తానంటూ వృద్ధ దంపతులను చెప్పాడు. దీంతో 45 లక్షల మేర కారును, నగదును మోహన్ రెడ్డి అకౌంట్‌కు పంపించారు వృద్ధ దంపతులు. ప్రస్తుతం మోహన్ రెడ్డి ఫోన్ ఎత్తకపోవడంతో తాము మోసపోయామని, స్వామిజీ బాలకృష్ణను కూడా సంప్రదించగా బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. పోలీసులే తమకు న్యాయం చేయాలంటూ వేడుకొంటున్నారు.

Full View
Tags:    

Similar News