TDP-Janasena: టీడీపీ- జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ

TDP-Janasena: బీజేపీ కూడా కలిస్తే జాబితాలో మార్పులు ఉంటాయనే ఊహాగానాలు

Update: 2024-01-06 14:45 GMT

TDP-Janasena: టీడీపీ- జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ

TDP-Janasena: ఏపీ రాజకీయాలు మంచి కాకమీద ఉన్నాయి. ఎన్నికల కురుక్షేత్రానికి అన్ని పార్టీలు.. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇంచార్జుల్లో మార్పులు, చేర్పులతో వైసీపీలో హడావిడి నెలకొంటే... సీట్ల పంపకాలపై టీడీపీ-జనసేన దృష్టి పెట్టాయి. ఐతే సీట్ల పంపకాలపై టీడీపీ-జనసేన మధ్య చర్చలు ఎక్కడి వరకు వచ్చాయి. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయంలో క్లారిటీ వచ్చిందా? మెజారిటీ సీట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందా..? లేక ఇంకా టైం పడుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

అభ్యర్థుల విషయంలో సంక్రాంతి కన్నా ముందే టీడీపీ- జనసేన కీలక ప్రకటన చేయాలని అనుకున్నా.. అది సాధ్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాతే అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల పంపకాలపై రెండు పార్టీలు ఓ అవగాహనకు రాకపోవడంతో డిలే కాబోతుందనే ప్రచారం జరుగోతోంది. సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీ మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

రెండు చోట్ల మార్చి... సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇస్తారా..? అనే వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఐతే టీడీపీ- జనసేనతో పొత్తు కోసం ఏపీ బీజేపీ నేతలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో.. ఏం జరగనుందనే చర్చ నడుస్తోంది. దీంతో పొత్తు పెట్టుకునే మరో పార్టీ ఏదైనా కలిస్తే జాబితాలో మార్పులు ఉంటాయా? ఒకవేళ అదే కనుక జరిగితే అభ్యర్థుల జాబితా ప్రకటన మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందట.

Tags:    

Similar News