JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం

రాజకీయాల్లో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరు చెప్పలేరు.. ఇప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది

Update: 2020-03-13 02:00 GMT
jc prabhakar reddy files nomination

రాజకీయాల్లో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరు చెప్పలేరు.. ఇప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. వాస్తవానికి ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ దానికంటే ఎక్కువ పదవి ఉన్న వాటికీ పోటి చేస్తారు కానీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం తక్కువ పోస్టుకు నామినేషన్ వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. గతంలో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకర్‌రెడ్డి తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా తాడిపత్రి పట్టణం 30వ వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు దాఖలు చేశారు. 

దీనితో తాడిపత్రిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.అంతేకాకుండా ఎమ్మెల్యేగా పనిచేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు మళ్లీ కౌన్సిలర్‌గా నామినేషన్ వేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు అదే వార్డు నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడం గమనార్హం.. టీడీపీకి అభ్యర్థులు దొరక్కపోవటం కారణంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. 

Tags:    

Similar News