చింతమనేని ప్రభాకర్ అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని తన నివాసంలోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2019-09-11 08:08 GMT

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని తన నివాసంలోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ఏలూరు పోలీన్‌ స్టేషన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. పది రోజుల క్రితం చింతమనేనిపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. అప్పట్నుంచి ఆయన అజ్ఞాతంలో ఉండగా.. 12 పోలీసు బృందాలు ఆయన కోసం గాలింపు చేపట్టాయి. ఈ పరిస్థితుల్లోనే దుగ్గిరాలలోని ఆయన నివాసానికి ఈ రోజు భారీగా చేరుకున్న పోలీసులు ఇంట్లోని గదులు, కపోర్టుల్లో సోదాలు నిర్వహించారు. ఎలాంటి సెర్చ్‌ వారెంట్‌ లేకుండా తమ ఇంట్లో ఎలా సోదాలు చేస్తారని చింతమనేని తండ్రి పోలీసులను ప్రశ్నించారు.

చింతమనేనిని అరెస్టుచేసి పోలీన్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో దుగ్గిరాలలోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


Tags:    

Similar News