Nara Lokesh: ఓ దిశ నువ్వెక్కడ? రాష్ట్రంలో మహిళలకు ఎన్నికల్లో నిలబడే హక్కు లేదా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2020-03-14 05:42 GMT
Nara lokesh (File Photo)

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ అరాచకాలు సృష్టిస్తుందని తమ పార్టీ అభ్యర్ధులను కనీసం నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో నామినేషన్ పత్రాలు చించేశారని నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీనిపైన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు..

" ఓ దిశ నువ్వెక్కడ? రాష్ట్రంలో మహిళలకు ఎన్నికల్లో నిలబడే హక్కు లేదా? భౌతిక దాడికి దిగి నామినేషన్ పత్రాలు చించేస్తారా? పుంగనూరు లో వైకాపా నాయకులు, కార్యకర్తలు దళిత మహిళ పట్ల వ్యవహరించిన తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకుంటుంది. 21 రోజుల్లో న్యాయం ఎక్కడికిపోయింది" అంటూ లోకేష్ ట్వీట్ చేశారు..

చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ ఆరో వార్డుకు టీడీపీ అభ్యర్థిగా విజయమ్మ నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా అక్కడ వైసీపీ నాయకులు అడ్డుకొని నామినేషన్ పత్రాలు లాక్కొని చింపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి విజయమ్మ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇందులో డిఎస్పి జోక్యం చేసుకొని నామినేషన్ ఆమెను దాఖలు చేయడానికి లోపలికి పంపారు. దీనిపైన లోకేష్ స్పందిస్తూ ట్విట్టర్ లో స్పందించారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21న పోలింగ్‌ జగరనుంది. ఫలితాలు ఈ నెల 24న తేలనున్నాయి.

Tags:    

Similar News