జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు .. నాదెండ్ల

Update: 2019-07-06 04:57 GMT

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ఘోర ఓటమిపాలు అయింది .. దీనితో టిడిపి పని అయిపోయిందని టిడిపికి కొత్త నాయకుడు అవసరం అనే చర్చ నడిచింది .. ఈ క్రమంలోనే హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర పైకి వచ్చింది .. రామ్ గోపాల్ వర్మ , నటుడు బ్రహ్మాజీ, వైసీపీ మంత్రి నాని లాంటి వాళ్లు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తిరిగి టిడిపిలో జవసత్వాలు నింపీ పార్టీని బలోపేతం చేస్తారని చెప్పుకొచ్చారు . జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టకపోతే టిడిపికి భవిషత్తు ఉండదని కొన్ని ఉహాగానాలు వినిపించాయి కూడా ..

అయితే ఇదే అంశంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు సంచలన వాఖ్యలు చేసారు ..నేను కూడా ఈ వార్తలు విన్నానని కానీ అసలు తనకి జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని వాఖ్యానించారు .. తన సినిమాలు కూడా నేను ఎప్పుడు చూడలేదని ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే నిర్ణయం తీసుకోవాలని అయన అన్నారు .. ప్రస్తుతం అయన చేసిన ఈ వాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి .. ఇక ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ రావు జనసేనలోకి వెళ్ళడం తప్పిదమేనని పరోక్షంగానే స్పందించారు అయన .. 

Tags:    

Similar News