వరదల కారణంగా రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దాంతో భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ దీక్ష చేస్తున్న చేస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో 12 గంటల పాటు చేపట్టిన దీక్ష ప్రారంభం అయింది. ఈ దీక్షకు బీజేపీ, జనసేన పార్టీలు మద్దతు పలికాయి. అయితే బీజేపీ మద్దతు పలికినప్పటికీ స్వయంగా పాల్గొనకుండా సంకీభావం మాత్రమే తెలిపింది. అయితే జనసేన మాత్రం ఇద్దరు నేతలను పంపాలని నిర్ణయించుకుంది.
కాగా చంద్రబాబు దీక్షకు మద్దతుగా భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఏర్పాట్లను నారా లోకేష్, అచ్చెన్నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు తోపాటుగా పలువురు యువనేతలు దీక్షలో పాల్గొంటున్నారు. మరోవైపు మంత్రులు చంద్రబాబు దీక్షపై మండిపడుతున్నారు.అక్టోబర్ లో చెయ్యాల్సిన దీక్ష ఇప్పుడు చేస్తే లాభం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కావలసినంత ఇసుక దొరుకుతుంటే దీక్ష ఎందుకని ఎద్దేవా చేశారు.