రేపు ఆంధ్రప్రదేశ్ వెళ్లనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతి వెళ్లనున్నారు.

Update: 2020-05-24 01:34 GMT
Andhra Pradesh ex Chief Minister Nara Chandrababu Naidu (file photo)

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత  చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతి వెళ్లనున్నారు. అయన లాక్ డౌన్ ప్రకటించడానికి కొద్దిగా ముందు హైదరాబాద్ వెళ్ళారు. అయితే, ఆయన వెళ్ళిన వెంటనే లాక్ డౌన్ విధించడంతో తిరిగి అమరావతి వెళ్ళడానికి వీలు పడలేదు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో పాటు, లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో చంద్రబాబు నాయుడు అమరావతి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈమేరకు అయన శనివారం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ డీజీపీ లకు అనుమతి కోసం లేఖ రాశారు. దానికి తెలంగాణా ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి లభించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి లభించాల్సి ఉంది. చంద్రబాబు అనుమతి కోసం రాసిన లేఖ ప్రకారం సోమవారం ఉదయం ఆయన విమానంలో విశాఖపట్నం వెళతారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అయన ఉండవల్లిలోని తన నివాసానికి రోడ్డు మార్గంలో వెళతారు. ఈ మేరకు తనకు అనుమతి ఇవ్వాలని ఏపీ డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు. 

కాగా, మాజీ ముఖ్ఈయమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 20 వతేదీన హైదరాబాద్ వెళ్ళారు. తరువాత వరుస లాక్ డౌన్ ల నేపధ్యంలో అక్కడే ఉండిపోయారు. ఈ మధ్య విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ఘటన జరిగినప్పుడు అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించేందుకు అయన ప్రయత్నించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అప్పుడు ఆయనకు అనుమతి లభించలేదు.

దీంతో ఇప్పుడు ఈ  విషయంలో కొంత ఉత్సుకత అందరిలోనూ నెలకొంది. చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అనుమతి ఇస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో పలు మార్లు అధికార పార్టీ నేతలు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వస్తే ఆయన 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని చెబుతూ వచ్చారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. 



 



Tags:    

Similar News