టీటీడీ బంగారం వివాదంపై విచారణకు సీఎస్‌ ఆదేశం

Update: 2019-04-21 14:45 GMT

 తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1381 కేజీల బంగారం వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఈ నెల 23వ తేదీలోగా దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మన్మోహన్‌ సింగ్‌ను విచారణాధికారిగా నియమించారు. ఆయనను తక్షణమే తిరుమలకు వెళ్లి విచారణ జరపాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బంగారం తరలింపులో వస్తున్న వదంతులపై విచారణ చేయాలని సూచించారు.

Similar News