ఇవాళ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారం
AP News: ప్రజాగళం సభల్లో పాల్గొననున్న ఇరుపార్టీల అధినేతలు
ఇవాళ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారం
AP News: ఏపీలో ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు కూటమి నేతలు. ఇందులో భాగంగానే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మరోసారి జాయింట్ క్యాంపెయిన్ చేపట్టనున్నారు. చంద్రబాబు నిర్వహిస్తోన్న ప్రజాగళం సభల్లో జనసేన అధినేత పవన్ పాల్గొననున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ ప్రచారం చేయనున్నారు. ఇవాళ తణుకు, నిడదవోలులో ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు. రేపు పి.గన్నవరం, అమలాపురంలో జరిగే ప్రజాగళం సభల్లోనూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తారు.