కర్నూలు మాంటిస్సోరి గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
కర్నూలు మాంటిస్సోరి గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఏపీ గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎస్. అబ్దుల్ నజీర్ 50 ఏళ్లలో ఈ విద్యాసంస్థలు ఎన్నో అద్భుతాలు సాధించిందన్న నజీర్ విద్యార్థులకు చదువే ముఖ్యమన్న నజీర్
కర్నూలు మాంటిస్సోరి గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
మాంటీస్సోరి విద్యా సంస్థలు 50 ఏళ్లలో ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లిందనన్నారు ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్. కర్నూలు మాంటిస్సోరి విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నగరంలోని ఏ.క్యాంపు మాంటీస్సోరి పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈవేడుకల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సంబంధించిన లోగో ఆవిష్కరించారు. ఎందరో ప్రముఖులు ఈ విద్యాసంస్థల విద్యార్థులేనని.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ప్రస్తుత కాశ్మీర్ ఎస్పీలు ఇక్కడే చదువుకున్నారన్నారు. ఈ సందర్భంగా మాంటీస్సోరి విద్యా సంస్థల అధ్యాపకులకు గవర్నర్ జ్ఞాపికలను అందజేశారు.