MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మార్చి 3న విడుదలైంది.
MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మార్చి 3న విడుదలైంది. మార్చి 29న ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఈ స్థానాలను భర్తీ చేసేందుకు మార్చి 20న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీటీ నాయుడు, ఆశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు పదవీకాలం పూర్తి కానుంది.
ఇక తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా హసన్ ఎఫెండీ పదవీ కాలం పూర్తి కానుంది.తెలంగాణలో నాలుగు స్థానాలు కాంగ్రెస్ కు, ఒక్క స్థానం బీఆర్ఎస్ కు దక్కే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే దక్కనున్నాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవి దక్కనుంది. ఆ తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు చంద్రబాబు.