Rajya Sabha Election: ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల
Rajya Sabha Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు మంగళవారం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల
Election Commission: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు మంగళవారం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్య రాజీనామాతో మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని మూడు స్థానాలతో పాటు ఒడిశా, బెంగాల్చ, హర్యానా రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్
డిసెంబర్ 3: రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్
డిసెంబర్ 10: నామినేషన్ల దాఖలుకు చివరి తేది
డిసెంబర్ 11: నామినేషన్ల పరిశీలన
డిసెంబర్ 13: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
డిసెంబర్ 20: పోలింగ్ (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)