Duronto Express: ఏలూరు జిల్లా భీమడోలు రైల్వేగేటు వద్ద వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్
Duronto Express: ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
Duronto Express: ఏలూరు జిల్లా భీమడోలు రైల్వేగేటు వద్ద వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్
Duronto Express: దురంతో ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేటు వద్ద దురంతో ఎక్స్‌ప్రెస్ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమదానాకి కారణమైన వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్, భీమడోలు రైల్వే గేటు వద్దకు చేరుకుంటుంది. అయితే, రైలు వస్తున్న సమయంలో గేటును ఢీకొని పట్టాలపైకి వచ్చి బొలెరో వాహనం ఆగిపోయింది. దీంతో దురంతో ఎక్స్‌ప్రెస్ వచ్చి బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. బొలెరో వాహనంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా, రైలు పట్టాలపై వాహనం నిలిచిపోవడంతో ఆ వాహనాన్ని వదిలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. అయితే, ఆ వాహనాన్ని ఢీకొన్ని రైలు మాత్రం అక్కడే నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.