దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి రాజీనామా

విజయవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఆమె కారులో మద్యం అక్రమ..

Update: 2020-10-01 12:29 GMT

విజయవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఆమె కారులో మద్యం అక్రమ రవాణా జరిగిందని వార్తలు వచ్చాయి. జగ్గయ్యపేటలో వాహనాన్ని పట్టుకున్నారు.. ఈ కేసులో ఇప్పటికే వరలక్ష్మి కుమారుడు సూర్యప్రకాశ్‌ గుప్తాపై పోలీసులు కేసు నమోదు చేశారు, డ్రైవర్‌ శివను అరెస్ట్‌ చేశారు.. అయితే తనకు సంబంధం లేకపోయినా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారామె. అక్రమ మద్యం రవాణాపై విచారణ ముగిసే వరకూ నైతిక

బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వరలక్ష్మి ఆలయ ఈవోకు, పాలకమండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. మరోవైపు నాగవరలక్ష్మి రాజీనామాను ఆమోదించినట్లు దుర్గగుడి ఛైర్మన్‌ తెలిపారు. అక్రమ మద్యం రవాణాపై అటు పోలీసులు దర్యాప్తు పాటు, అంతర్గతంగా విచారణ జరుగుతోందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలావుంటే అక్రమ మద్యం రవాణాపై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆరాతీశారు. కేసు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News