Govt Scheme: రైతులకు పండగలాంటి వార్త..మీ ఖాతాల్లోకి ఒకేసారి ఆ రెండు స్కీముల డబ్బులు..!!

Govt Scheme: రైతులకు నిజంగా ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం రైతులకు మద్దతుగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Update: 2025-06-06 01:45 GMT

 Govt Scheme: రైతులకు పండగలాంటి వార్త..మీ ఖాతాల్లోకి ఒకేసారి ఆ రెండు స్కీముల డబ్బులు..!!

Govt Scheme: రైతులకు నిజంగా ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం రైతులకు మద్దతుగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం..అన్నదాత సుఖీభవ స్కీమును అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. సూపర్ సిక్స్ స్కీముల్లో భాగంగా తీసుకన్న ఈ నిర్ణయం ద్వారా ప్రతి రైతుకూ ఏడాదికి రూ. 20వేల ఆర్థిక సహాయం అందించనుంది. ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీముతో కలిసి అమలు చేయనుంది.

పీఎం కిసాన్ స్కీముతో వచ్చే రూ. 2వేలతోపాటుగా ఏపీ ప్రభుత్వంరూ. 5వేల చొప్పున రెండు విడతల్లో చివరగా మరో రూ. 4వేలు చెల్లించనుంది. ఈ మొత్తం రూ. 20వేలు రైతుల అకౌంట్లో మూడు విడతలుగా జమ చేయనుంది. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీము కింద 20వ విడత నిధులు విడుదల చేయనుంది. గత ఫిబ్రవరిలో 19వ విడత నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీముల్లో భాగంగా ఏప్రిల్ నుంచి జులై వరకు తొలి విడత, ఆగస్టునుంచి నవంబర్ వరకు రెండోవిడత, డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడో విడతగా చెల్లింపులు జరుగుతాయి.

అయితే రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు తప్పనిసరిగా పూర్తిచేయాలి. ముఖ్యంగా ఈకేవైసీ పూర్తిచేసి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. భూమి పత్రాలు అప్ డేట్ చేసి ఉండాలి. ఈ కేవైసీ కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ www.pmkisan.gov.in లోకి వెళ్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీని సబ్ మిట్ చేయాలి. లేదంటే సీఎస్సీ సెంటర్ ద్వారా బయోమెట్రిక్ పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 

Tags:    

Similar News