ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి అవంతి

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటాయేమోనని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Update: 2019-12-18 06:59 GMT
మంత్రి అవంతి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటాయేమోనని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో అమరావతిలోని కొందరు రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. సీఎం వ్యాఖ్యలపై అమరావతి సచివాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈలోగా మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రెస్ మీట్‌లో రైతులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. రాజధానులపై ఆరోపణలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. "రాజధానులు కుల ఆధారితవి కావు" అని మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని ఏ కులానికి వ్యతిరేకం కాదని, అమరావతి రైతులకు ఉత్తమమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవంతి అన్నారు. అమరావతి శాసనసభ పరిపాలనా రాజధాని అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాజధానిని రాజకీయ కోణం నుండి చూడవద్దని సూచించారు. మరోవైపు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా, అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలోని మందడం వద్ద రోడ్లపై కొందరు రైతులు నిరసన ప్రదర్శన చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రధానిని కలిసి ఫిర్యాదు చెయ్యాలని వారు భావిస్తున్నారు.

Tags:    

Similar News