AP Health Departments Jobs 2020: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నలబై ఏళ్లలో ఇదే తొలిసారి!

AP Health Departments Jobs 2020: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యానికి డబ్బుల్లేక, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందక సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Update: 2020-06-29 01:35 GMT

AP Health Departments Jobs 2020: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యానికి డబ్బుల్లేక, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందక సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ దుస్థితి తొలగిపోతుంది. తాజా నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రంలో తొమ్మిది వేలకుపైగా వైద్య పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో ఆరోగ్యశాఖకు అదనపు బలం చేకూరనుంది. ఈ నియామకాల ద్వారా ఇప్పటి వరకు అస్తవ్యస్థంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల దుస్థితి తొలగిపోనుంది. గత ప్రభుత్వాలు ప్రభుత్వాసుపత్రుల్లో నియామకాలు భారంగా భావించాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఒకే ఒక్క నియామకం ద్వారా 9,712 వైద్య పోస్టులు భర్తీ చేస్తుండటం గత నలభై ఏళ్లలో ఎప్పుడూ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 1,175 పీహెచ్‌సీలు ఇకపై 24 గంటలూ పనిచేయనున్నాయి. ఇక నుంచి ఇద్దరు డాక్టర్లతో పాటు స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్ట్‌లు అందుబాటులో ఉంటారు. ఆస్పత్రుల్లో మానవ వనరుల అభివృద్ధి, రోగుల భరోసాకు సూచికగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిద్వారా గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు ప్రభుత్వాసుత్రుల్లో వైద్యుల కొరత తీరనుంది.

యువ వైద్యులు, అనుభవజ్ఞులతో 2 నెలల్లో ప్రభుత్వాసుపత్రులన్ని కొత్తకళ సంతరించుకోనున్నాయి. రాష్ట్రంలో 1,175 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా... ప్రస్తుతం సగం పీహెచ్‌సీల్లో ఒకే ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. వైద్యుడు సెలవుపై వెళితే ఇక స్టాఫ్‌ నర్సే మిగులుతారు. సామాన్యుడు గాయాలతో ఆసుపత్రులకు వెళితే తాళాలు వేసి కనిపించేవి. ఇకపై ఇలా ఉండదు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు.

రాష్ట్రంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ 24 గంటలు పనిచేస్తాయి. కొత్తగా డాక్టర్లు, ఫార్మసిస్ట్‌లు, స్టాఫ్‌ నర్సులను నియమిస్తే 24 గంటలూ ఆస్పత్రులు పనిచేయడంతో సామాన్యులకు ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇబ్బంది ఉండదు.రాష్ట్రవ్యాప్తంగా.. 192 సామాజిక ఆరోగ్యకేంద్రాలులు ఉన్నాయి. వీటిలో గైనకాలజిస్ట్, అనస్థీషియా పీడియాట్రిక్స్‌ వైద్యులు బృందం ఉంటుంది. ప్రసవాలు ఎక్కువగా... జరుగుతున్న 70 వైద్య కేంద్రాలకు ఒక్కో కేంద్రానికి నలుగురు గైనకాలజిస్ట్‌లను నియమిస్తున్నారు.


Tags:    

Similar News