Top
logo

ఏపీవీవీపీలో 723 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

ఏపీవీవీపీలో 723 ఉద్యోగాలకు ప్రకటన విడుదల
X
Highlights

నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ లోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షమ శాఖ రాష్ట్రంలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఖాళీగా ఉన్న 723 పోస్టులను భర్తీ చేయనున్నారు. రేడియాలజీ, డెర్మ‌టాల‌జీ, గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పాథాలజీ, విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయనున్నారు. 01.7.2020 నాటికి 42 ఏళ్లు మించ‌ని వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయనున్నారు. ఔత్సాహిక అభ్యర్థులు జులై 18, 2020 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్-692‌

డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌-31

మొత్తం ఖాళీల సంఖ్య : 723

ఉద్యోగ వివరాలు

దరఖాస్తులకు ఆఖరితేది : 2020-07-18

వేతనం : 53500/నెలకి

వివరాలకోసం http://apvvp.nic.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Web Titleapvvp recruitment 2020 notification released for 723 civil and dental assistant surgeons
Next Story