కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో ప్రకటించిన టిమ్స్ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో ఉద్యోగులను...

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో ప్రకటించిన టిమ్స్ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో ఉద్యోగులను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని వీలైనంత తొందర్లో పూర్తి చేసి, మరింత పగడ్బందీగా కరోనా రోగులకు వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణలో కోవిడ్ ప్ర‌త్యేక ఆసుప‌త్రిగా నిర్మించిన గ‌చ్చిబౌలి టిమ్స్ లో ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు సిబ్బంది నియామ‌కానికి చ‌ర్య‌లు తీసుకుంది. ఓవైపు క‌రోనా కేసులు పెరుగుతుంటే ప్ర‌భుత్వం టిమ్స్ ను ఖాళీగా ఉంచ‌టంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స‌హా ప‌లువురు ప్ర‌శ్నించిన మ‌రుస‌టి రోజే టిమ్స్ లో ఉద్యోగ భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటీఫికేష‌న్ విడుద‌ల చేసింది.

టిమ్స్ లో తాత్కాలిక ప్రాతిపాదిక‌న వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాల‌ను చేప‌ట్టింది. జూన్ 19వ తేదీ సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు వివిధ శాఖ‌ల్లో పోస్టుల‌కు ఆస‌క్తి గ‌ల వారు అప్లై చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. మొత్తం 499మంది సిబ్బంది నియామ‌కానికి సంబంధించి ప్ర‌భుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories