వికలాంగులకు ఇచ్చే పెన్షన్లనూ ఎత్తేశారు.. వీడియోను పోస్ట్ చేసిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు ఎక్కుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల ముందు పెన్షన్లను పెంచుకుంటు పోతామని హామీలు ఇచ్చిన జగన్, ఇప్పుడు కోసుకుంటూ పోతున్నారని విమర్శించారు. ట్విటర్ వేదికగా లోకేశ్ విమర్శలు చేశారు. అర్హులైన పేదలకు పెన్షన్ల ఇవ్వడం లేదని అన్నారు. ఏడు లక్షల మందికి పెన్షన్లు తొలిగించారని మండిపడ్డారు. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ల తీసేశారని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. మంగళగిరిలోని రత్నాలచెరువులో నివాసం ఉంటున్న వికలాంగుడు కొండక తవిట రాజు ఫోటోను ట్విట్ చేశారు. తవిట రాజు కనీసం సరిగ్గా కూర్చోలేని పరిస్థితి అని, అతనికి మాటలు కూడా స్పష్టంగా రావని, తవిట రాజు పెన్షన్ రద్దయిందని పోస్ట్ ద్వారా లోకేశ్ విమర్శించారు. తవిట రాజు తల్లి చంద్రబాబు పాలనలో తన కొడుకుకి పెన్షన్ వచ్చిందని, ఇప్పుడు రావడం లేదని, ఈ విషయంలో ఎవరిని అడిగిన స్పందించడం లేదని వీడియో తెలిపింది. ఈ వీడియోను లోకేశ్ ట్విటర్లో పోస్టు చేశారు.
7 లక్షల మంది పెన్షన్లు తీసేసారు. ఎన్నికల ముందు పెంచుకుంటూ పోతా అని ఇప్పుడు కోసుకుంటూ పోతున్నారు @ysjagan గారు. ఆఖరికి వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కూడా ఎత్తేసారు. (1/2) pic.twitter.com/AoukceTmOc
— Lokesh Nara (@naralokesh) February 4, 2020