దర్శకుడు వినాయక్ సీఎం జగన్ ను కలిసింది వారికోసమేనా..?

నటుడు, దర్శకుడు వివి వినాయక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వినాయక్ జగన్ ను కలిసి సన్మానించారు. ఈ సందర్బంగా జగన్ తో అరగంట పాటు

Update: 2019-11-07 02:30 GMT

నటుడు, దర్శకుడు వివి వినాయక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వినాయక్ జగన్ ను కలిసి సన్మానించారు. ఈ సందర్బంగా జగన్ తో అరగంట పాటు వినాయక్ సమావేసం అయ్యారు. జగన్ ముఖ్యమంత్రిగా అతిపెద్ద విజయం సాధించిన తరువాత సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు తప్ప ఎవరూ రాలేదన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత పృథ్వీ కూడా ఈ విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే సైరా సినిమా చూడాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి.. జగన్ ను కలిశారు. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది క్యూ కడతారని భావించారు.. కానీ ఎవరూ రాలేదు. అగ్రనిర్మాతలుగా చెప్పుకునే వారు ఇంతకుముందే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరామని గతంలో చెప్పారు.. అయితే వారు ఇంతవరకు కలవలేదు. తాజాగా వినాయక్ కు వెంటనే అపాయింట్మెంట్ ఖరారు కావడం వెనుక మతలబేంటని చర్చించుకుంటున్నారు.

వాస్తవానికి వినాయక్ సోదరుడు, బంధువులు అందరూ కూడా వైసీపీలోనే ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ విజయానికి వినాయక్ బంధువులు పనిచేశారు. మరోవైపు వినాయక్ కు మెగా కుటుంబంతో ఎప్పటినుంచో అనుబంధం ఉంది. అయితే అలా అని జనసేనలో చేరలేదు. ఇటు వైసీపీకి మద్దతుగా కూడా నిలబడలేదు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబంతో కూడా వినాయక్ కు మంచి అనుబంధమే ఉంది. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాబాబు ప్రమాణస్వీకారం సమయంలోను వినాయక్ దర్శనమిచ్చారు. ఆ సందర్బంగా వినాయక్ మాట్లాడుతూ.. వైసీపీని నమ్ముకొని ఉన్నందుకు జక్కంపూడి ఫ్యామిలీకి జగన్ న్యాయం చేశారని అన్నారు.

జగన్ లాంటి నాయకుడు ఉండటం రాష్ట్రానికి మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో ఆయన వైసీపీలో చేరతారని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. తాను కేవలం జక్కంపూడి ఫ్యామిలి కోసమే వచ్చానని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో వినాయక్ తాజాగా ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంస్యమైంది. ఈ సమయంలో వినాయక్ సీఎంను ఎందుకు కలిశారనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. వినాయక్ కుటుంబసభ్యుల రాజకీయ భవితవ్యం దృష్ట్యా జగన్ ను కలిశారనే వాదన వినబడుతుండగా.. మరోవైపు మర్యాదపూర్వకంగానే కలిశారని వినాయక్ సన్నిహితులు చెబుతున్నా.. ప్రయోజనం లేకుండా వినాయక్ లాంటి అగ్రదర్శకులు ముఖ్యమంత్రిని కలవరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వినాయక్ కూడా భేటీ విషయాలను వెల్లడించని కారణంగానే ఈ చర్చ జరుగుతోంది. 

Tags:    

Similar News