ఏపీకి మూడు రాజధానులు.. టీడీపీలో భిన్నాభిప్రాయాలు

ఉత్తరాంధ్ర కీలక జిల్లా అయిన విశాఖలో రాష్ట్ర పరిపాలనా రాజధాని ఉండవచ్చని ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ కీలకనేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమర్ధించారు.

Update: 2019-12-18 03:32 GMT
గంటా శ్రీనివాసరావు

ఉత్తరాంధ్ర కీలక జిల్లా అయిన విశాఖలో రాష్ట్ర పరిపాలనా రాజధాని ఉండవచ్చని ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ కీలకనేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమర్ధించారు. విశాఖను రాజధాని చేస్తే ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషిస్తారని పేర్కొన్నారు. ఆయన మాటల్లోనే.. 'విశాఖపట్నంని పరిపాలనా రాజధాని గా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభ లో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం. రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ తో రాజధాని గా అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రం గా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయం. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.' అని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. అయితే గంటా శ్రీనివాసరావు సమర్ధన పై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలని టీడీపీ తీర్మానించింది. మూడు రాజధానులు చేస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడని చంద్రబాబునాయును ప్రశ్నించారు. అయితే ఇందుకు బిన్నంగా సీఎం నిర్ణయాన్ని స్వాగతించడం పట్ల ఆ పార్టీలో మరోసారి గంటా చర్చనీయాంశయంగా మారారు.

Tags:    

Similar News